Iphone 17: ఐఫోన్ 17 సిరీస్ లీక్స్.. ఊహించని సరికొత్త ఫీచర్లు! 11 month ago

featured-image

టెక్ దిగ్గజమైన యాపిల్ ఐఫోన్ కొత్త 17 సిరీస్ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ ఐఫోన్ 17 సిరీస్ ను 2025లో విడుదల చేస్తున్నట్లు యాపిల్ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉన్నాయి.. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, మరియు సరికొత్త ఐఫోన్ 17 "ఎయిర్". ఈ సిరీస్ లాంచ్ తేదీని యాపిల్ అధికారికంగా వెల్లడించకపోయినా..వివిధ నివేదికల ద్వారా సెప్టెంబర్ 2025లో ఈ సిరీస్ విడుదలయ్యే అవకాశం ఉందనే ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. 


Iphone 17 సిరీస్ ఫీచర్లు:

డిజైన్:

ఈ సిరీస్‌లో "ఎయిర్" మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎదుకంటే ఇది కేవలం 5.5mm మందంతో వస్తుందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇది Samsung Galaxy S25 Edge కంటే కూడా 0.34mm సన్నగా ఉంటుందట. ఇక దీని డిస్‌ప్లే అచ్చం ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లగే 6.9-అంగుళాల LTPO AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ప్రారంభంలో ఇది అత్యంత ఖరీదైన మోడల్ అని వార్తలు వచ్చినా.. ఇప్పుడు ఇది సాధారణ ఐఫోన్ 17 మరియు ప్రో మోడళ్ల మధ్య ధరలో ఉంటుందని తెలుస్తోంది.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ 8.7mm మందంతో వస్తుంది. ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ రెండూ.. ఐఫోన్ 16 ప్రో మాక్స్ మాదిరి స్లిమ్ ఫ్రేమ్ ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 17 సిరీస్‌లోని మిగిలిన మోడళ్లలో టైటానియంకు బదులుగా అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగించనున్నారు. ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఎత్తు 163mm, వెడల్పు 77.6mm ఉండొచ్చని అంచనా. Iphone 17 సిరీస్ లోని 4 మోడళ్లు ఇంచుమించు ఒకే డిజైన్ తో వస్తున్నాయి.


ప్రాసెసర్:

ఐఫోన్ 17 సిరీస్ ఆపిల్ A19 బయోనిక్ చిప్ ప్రాసెసర్ సెట్ తో వస్తున్నాయి. ప్రో, ప్రో మాక్స్ లలో A19 ప్రో చిప్ వాడారు. ఈ 17 సిరీస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.


కెమెరా ఫీచర్లు:

ఐఫోన్ 17 సిరీస్ మోడ్లలలో మూడు రియర్ కెమెరాలు ఉండవచ్చు. ఇది అధునాతన కెమెరా సెటప్ అని సమాచారం.

48 MP మెయిన్ కెమెరా.. 12 MP అల్ట్రా వైడ్ లెన్స్.. 24 MP సెల్ఫీ కెమెరా ఉంటాయని తెలుస్తుంది. ఐఫోన్ 17 ఎయిర్ మోడల్‌లో వెనుకవైపు ఒకే ఒక కెమెరా ఉంటుందని సమాచారం. ఇది మిగిలిన ఐఫోన్ 17 సిరీస్ మోడళ్లతో పోలిస్తే కొంచం భిన్నంగా ఉండబోతుంది. 


RAM మరియు మోడెమ్:

స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ 8GB RAM తో రానున్నట్టు అంచనా.. హై-ఎండ్ మోడళ్లలో (ఐఫోన్ 17 ప్రో మరియు ప్రో మాక్స్) 12GB RAM రానున్నాయి. 128GB, 256GB మరియు 512GB వేరియంట్లలో వస్తుంది. ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ లేదు.

ఐఫోన్ 17 ఎయిర్ లో యాపిల్ స్వంత 5G మోడెం ను వాడే అవకాశం ఉంది. మిగిలిన మోడల్స్ క్వాల్కమ్ మోడెం తో వస్తాయి.


బ్యాటరీ మరియు ఛార్జింగ్:

ఐఫోన్ 17 సిరీస్ మోడళ్లు 4500mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తున్నాయి. అలాగే 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, మెరుగైన మాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండనున్నాయి. ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ మాత్రం 4700mAh బ్యాటరీతో వస్తుంది.


ధర వివరాలు (అంచనా):

  • ఐఫోన్ 17 - రూ. 79,900
  • ఐఫోన్ 17 ఎయిర్ - రూ. 89,900
  • ఐఫోన్ 17 ప్రో - రూ. 1,19,900
  • ఐఫోన్ 17 ప్రో మాక్స్ - రూ. 1,44,900


ఐఫోన్ 17 సిరీస్..అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో ఇది మొబైల్ టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుంది. వినియోగదారుల అంచనాలను అందుకుంటూ, ఆపిల్ మరోసారి తన సత్తా చాటుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా 'ఎయిర్' మోడల్ సన్నని డిజైన్ తో అందరినీ ఆకర్షిస్తుంది. ఈ సిరీస్ 2025 సెప్టెంబర్ 19న విడుదల ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 


రూ.50 వేల ధర గల ఫీచర్లు ఇప్పుడు కేవలం రూ.35 వేలకే.!

Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD